సీబీఐ కార్యాలయం లో చిదంబరం విచారణ || P.Chidambaram Taken Into Custody By CBI In INX Media Case

2019-08-22 518

Dramatic scenes unfold at Chidambaram's residence in Jor Bagh as sleuths of the CBI, including the senior officers, are jumping over the wall to get into his residence. Nearly 20 officials jumped over the wall as the gates had been closed.
#Chidambaram
#INXmedia
#Chidambaramarrest
#amitshah
#congress
#bjp
#delhi
#cbi
#ED


న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా ఒప్పందంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ బుధవారం రాత్రి అరెస్టైన మాజీ కేంద్రమంత్రి పీ చిదంబరంకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు తెరపైకి వచ్చింది. బుధవారం రాత్రి చిదంబరంను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే, గతంలో కేంద్రమంత్రిగా ఉన్న చిదంబరం సీబీఐ కార్యాలయ ప్రారంభోత్సంలో ముఖ్య అతిథిగా పాల్గొనడం గమనార్హం. 2011లో కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న చిదంబరం అదే సంవత్సరం జూన్ 30న ఢిల్లీలో కొత్త సీబీఐ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, ఇతర మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే, 8ఏళ్ల క్రితం ఏ సీబీఐ కార్యాలయం ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారో.. అదే అదే కార్యాలయానికి చిదంబరంను అరెస్ట్ చేసి తరలించడం చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.